
సమాజ సేవే ధ్యేయంగా, సేవే సంకల్పంగా గత పదిహేనేళ్లుగా నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తూ సమాజంలో విశేషమైన గౌరవం, ఆదరణ పొందుతున్న వివేకానంద ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది. ఈ సంస్థ స్థాపన నుంచి నేటివరకు చేపడుతున్న సేవా కార్యక్రమాలు చూస్తే, ఒక సంస్థ నిజమైన సామాజిక బాధ్యతతో పనిచేస్తే ఎంతటి మార్పు సాధ్యమో స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం,...


